calender_icon.png 6 July, 2025 | 3:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మిత్రుని కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత

05-07-2025 07:24:40 PM

చిట్యాల,(విజయక్రాంతి): మండలంలోని కైలాపూర్ గ్రామానికి చెందిన సకినాల కుమారస్వామి ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. కాగా మృతుని సోదరుడు రాకేష్ మిత్రులంతా కలిసి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అంతేకాకుండా మిత్రులంత కలిసి జమ చేసిన నగదు రూ.40వేలను మృతుని దశదినకర్మ రోజు బాధిత కుటుంబ సభ్యులకు అందజేసి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటామని భరోసానిచ్చారు. జీవితంలో ఎంతో మంది మీకు మేమున్నాం అని చెప్తుంటారు.. కానీ ఆచరణలో నిలిచేది ఎంతమంది? అలా నిలిచేవారే నిజమైన స్నేహితులనీ పలువురు మిత్రులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మిత్ర బృందం పాల్గొన్నారు.