14-03-2025 01:02:54 AM
ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి
కాంగ్రెస్ నాయకులు కావాలనే
పార్కు ప్రారంభోత్సవాన్ని వాయిదా వేస్తున్నారు
ఎల్బీనగర్, మార్చి 13 : బీఎన్ రెడ్డి నగర్ డివిజన్ లోని ఫేజ్ -3 కాలనీలో కోటి ఇరవై అయిదు లక్షల రూపాయల వ్యయంతో హెచ్‌ఏండీఏ ఆధ్వర్యంలో నిర్మించిన థీమ్ పార్కును అద్భుతంగా నిర్మిస్తున్నట్లు ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అన్నారు.
ఈ మేరకు గురువారం పార్కు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లా డుతూ... బీఎన్ రెడ్డి నగర్ డివిజన్ లో ఒక ఎకరం స్థలంలో అద్భుతమైన ధీమ్ పార్క్ నిర్మిస్తున్నట్లు తెలిపారు. పార్కులో అద్భుతమైన బుద్ధుడి విగ్రహం, యోగా స్థలం, చిల్డ్రన్ ప్లే పార్క్, వాకింగ్ ట్రాక్, అద్భుతమైన గార్డెన్ నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. ఓపెన్ జిమ్ కూడా అతి త్వరలోనే ఏర్పాటు చేస్తామని తెలిపారు. పనులు తుది దశకు చేరాయని తెలిపారు.
కాలనీవాసులు మాట్లాడుతూ... పూర్తి స్థాయిలో పార్క్ నిర్మించారని, వెంటనే పార్కును ప్రారంభించాలని కోరారు. దాదాపు మూడు నెలలుగా పార్కు ప్రారంభోత్సవాన్ని వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ డివిజన్ అధ్యక్షుడు కటికరెడ్డి అరవింద్ రెడ్డి, గడ్డిఅన్నారం మార్కెట్ కమిటీ మాజీ సభ్యులు అనిల్ చౌదరి, సుమన్ గౌడ్, సతీష్ కుమార్, రాఘవేంద్రరావు, కృష్ణతో పాటు పలు కాలనీ సంఘాల అధ్యక్ష, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.