14-03-2025 01:03:11 AM
జిల్లా పంచాయతీ అధికారి వీర బుచ్చయ్య
మంథని మార్చి 13(విజయ క్రాంతి): జిల్లాలో గ్రామ పంచాయతీలలో పారిశుధ్య కార్యక్రమాలు నిరంతరం సక్రమంగా నిర్వహించాలని జిల్లా పంచాయతీ అధికారి వీర బుచ్చయ్య పేర్కొన్నారు. గురువారం ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమంలో భాగంగా మంథని మండలంలో గుంజపడుగు, నాగారం , మల్లెపల్లి, ఎక్లాస్ పూర్ మరియ సూరయ్య పల్లి గ్రామ పంచాయతీలలో జరుగుతున్ను ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలను ఆఖస్మికంగా ఆయన సందర్శించారు.
పంచాయతీ కార్యదర్శులకు తగు సూచనలు జారీ చేసి, గ్రామ పంచాయతీలలో పారిశుధ్య కార్యక్రమాలు నిరంతరం సక్రమంగా జరగాలని గ్రామాలలో సేకరించిన తడీ పొడి చెత్తని శెగ్రిగేషన్ షెడ్డులో వేరు చేసి నాణ్యమైన కంపొస్ట్ ను తయారు చేయాలని మరియు గ్రామాలలో ప్రజలకు మంచి నీటి ఎడ్డటి రాకుండా పంచాయతీ కార్యదర్శులు, ఆర్ డబ్లుఎస్ అధికారులతో సమన్మయం చేసుకొని నీటి ఎద్దటి లేకుండా చూడాలని, ఇంటి పన్నులు వసూల్లు ఈ నెల 20 తేదీ వరకు 100% పూర్తి చేయలని, తదుపరి ఎల్ ఆర్ ఎస్ ఆర్జీదారులతో వ్యక్తిగతంగా ఇంటికి ఇంటీకి వెళ్ళి మరియు చరవాణి ద్వారా సంప్రదించి మార్చి 31 లోపు రుసుము చెల్లించిన చో 25% లబించే రాయితి పై అవగాహణ కల్పించాలని, ఈనెల 31 లోపు ఆర్జీ దారుల అందరితో ఎల్ ఆర్ ఎస్ రుసుము చెల్లించేల చూడాలని పంచాయతీ కార్యదర్శులకు ఆదేశించారు. ఆయన వెంట మంథని డివిజనల్ పంచాయతీ అధికారి సతీష్ కుమార్, మండల పంచాయతీ అధికారి శేషయ్య సూరి, సంబందిత పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు.