02-11-2025 12:00:00 AM
ఆరోగ్యకరమైన జీవితానికి ‘స్మార్ట్’ ఎంపిక
హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 1 (విజయక్రాంతి): హైదరాబాద్‌లో ప్రముఖ డయాగ్నస్టిక్ నెట్‌వర్క్‌లలో ఒకటైన స్ప్రింట్ డయాగ్నస్టిక్స్.. శనివారం జూబ్లీహిల్స్ బ్రాం చీలో వెల్నెస్ ఫ్యామిలీ కార్డ్‌ను ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ నటుడు డాక్టర్ అలీ, ప్రత్యేక అతిథిగా నటుడు, నిర్మాత, మా అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ మాదాల రవి హాజరయ్యారు. వెల్నెస్ ఫ్యామిలీ కార్డ్ ద్వారా కస్ట మర్లు అనేక రకాల ప్రయోజనాలను పొందగలరు.
ల్యాబ్ డయాగ్నస్టిక్స్, సీటీ, ఎంఆర్‌ఐ స్కాన్లు, క్యాన్సర్, ట్యూమర్ మార్కర్ టెస్టులపై 25% తగ్గింపు, ఎలక్ట్రోడయాగ్నస్టిక్ సేవ లపై 15%, హెల్త్ చెక్-అప్ ప్యాకేజీలపై 10% తగ్గింపు లభిస్తుంది. ఈ అన్ని ప్రయోజనాలు కేవలం రూ.200 ఒక్కసారిగా చెల్లించి, జీవితకాలం చెల్లుబాటు అయ్యేలా అందుబా టు లో ఉంటాయి. అలీ మాట్లాడుతూ.. “స్ప్రింట్ డయాగ్నస్టిక్స్ వెల్నె స్ ఫ్యామిలీ కార్డ్ కేవలం డిస్కౌంట్ కార్డ్ మాత్రమే కాదు ఇది ప్రజల్లో ముందస్తు జాగ్రత్తల పట్ల చైతన్యం కలిగించే గొప్ప ప్రయత్నం” అన్నారు.
మాదాల రవి మాట్లాడుతూ.. “ఆరోగ్య సేవలు ప్రత్యేకులకు మాత్ర మే కాకుం డా, ప్రతి కుటుంబానికీ అందుబాటులో ఉండాలి. స్ప్రింట్ డయాగ్నస్టిక్స్ ఈ అవసరాన్ని గుర్తించి, ముందడుగు వేయడం అభినందనీయం”అన్నారు. స్ప్రిం ట్ డయాగ్నస్టిక్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ భరత్‌రెడ్డి మాట్లాడుతూ.. “నేటి కాలంలో జీవనశైలికి సంబంధించిన వ్యాధులు పెరుగుతున్నందున, ముందస్తు నిర్ధారణ చాలా అవసరం.
వెల్నె స్ ఫ్యామిలీ కార్డ్ ద్వారా అధునాతన పరీక్షలను సులభంగా, తక్కువ ఖర్చుతో అం దించి, ప్రజల్లో రెగ్యులర్ హెల్త్ చెక్‌అప్ అలవాటు పెంచడమే మా ఉద్దేశం”అన్నారు. స్ప్రింట్ డయాగ్నస్టిక్స్ ఇప్పటికే మూవీ ఆర్టి స్ట్స్ అసోసియేషన్ కుటుంబంతో అనుబం ధం ఏర్పరచుకొని, వారి సభ్యులు, కుటుంబ సభ్యులకు వెల్నెస్ ఫ్యామిలీ కార్డులు అందిస్తోంది.