calender_icon.png 7 May, 2025 | 10:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లచ్చన్ గ్రామంలో ఘనంగా అంబేద్కర్ జయంతి

29-04-2025 08:47:33 PM

కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలోని లచ్చన్ గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి ఉత్సవమును మంగళవారం అంబేద్కర్ సంఘ సభ్యులు ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా  సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు వి. సురేష్ మాట్లాడుతూ... బడుగు బలహీన వర్గాల వారికి అంబేద్కర్ సేవలు మరువలేనివని ఈ సందర్భంగా ఆయన కొనియాడారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్ అని పేర్కొన్నారు. పేదల అభ్యున్నతి తన ధ్యేయంగా భారత రాజ్యాంగ నిర్మాణంలో తన వంతు పాత్రను పోషించారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘ సభ్యులు, బడుగు బలహీన వర్గాల చెందిన సభ్యులు,  ఇతరులు పాల్గొన్నారు.