బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి ఘనంగా నిర్వహణ
సనత్‌నగర్,(విజయక్రాంతి): భారత రాజ్యాంగ నిర్మాత, భారత్ రత్న డా. బి.ఆర్. అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా బీజేపీ ఎస్.సి మోర్చా మహంకాళి సికింద్రాబాద్ జిల్లా అధికార ప్రతినిధి సుమన్ కుమార్ ఆధ్వర్యంలో సనత్‌నగర్ నెహ్రూ పార్క్‌లోని బీజేపీ చౌక్ వద్ద ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు అర్పించి ఘన నివాళులు సమర్పించారు.అనంతరం అంబేద్కర్ సేవలను స్మరించుకుంటూ, ఆయన దేశానికి అందించిన రాజ్యాంగం సమానత్వం, న్యాయం, స్వేచ్ఛలకు మార్గదర్శకమని కొనియాడారు.
అంబేద్కర్ గారి ఆశయాలను ప్రతి ఒక్కరూ అనుసరించాలని, సామాజిక సమానత్వం కోసం ఆయన చేసిన పోరాటం చిరస్మరణీయమని నాయకులు పేర్కొన్నారు. యువత ఆయన చూపిన మార్గంలో నడిచి సమాజ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా బాటసారులకు పండ్లు, స్వీట్లు పంపిణీ చేసి సేవా కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






