calender_icon.png 13 September, 2025 | 11:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చిచ్చుపెట్టాలని చూడడం సరికాదు

13-09-2025 10:06:54 PM

మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఓబెదుల్లా కొత్వాల్ ను సస్పెండ్ చేయాలి 

పరిరక్షణ సమితి చైర్మన్  సింగిరెడ్డి

హన్వాడ: దళితులకు ముస్లింలకు మధ్య చిచ్చు పెట్టాలని చూడడం సరికాదని డాక్టర్ BR అంబేద్కర్ కళాభవనం పరిరక్షణ సమితి చైర్మన్ సింగిరెడ్డి అసహనం వ్యక్తం చేశారు. శనివారం మండల కేంద్రంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కళా భవనం పరిరక్షణ కమిటీ( జేఏసీ) ఉమ్మడి జిల్లా ఆధ్వర్యంలో మండల కేంద్రంలో  దళిత బహుజన సంఘాలు ప్రతినిధుల సమావేశం నిర్వహించారు.  దళితులు, ముస్లింల మధ్య చిచ్చు పెడుతున్న మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుండి ఓబెద్దుల కొత్వాల్ ను వెంటనే సస్పెండ్ చేయాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అంబేద్కర్ కళాభవనం స్థలంకు రక్షణ కల్పించాలి దళిత బహుజన కుల సంఘాల ఒక్క తాటిపైకి వచ్చి నిరసన తెలుపుతున్న పట్టించుకోకపోవడం సరికాదు అన్నారు.  డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కళాభవనం ప్రాంగణంలో ఉర్దూ ఘర్ ఒక మత పరమైన కార్యక్రమాలు ముస్లిం మత సిద్ధాంతాలను ముస్లిం ప్రజలకు విద్యార్థులకు శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయడానికి 15 కోట్ల భవనం నిర్మించాలని ప్రయత్నాలు కొనసాగుతున్నాయన్నారు.

హజ్ వెళ్లే వాళ్లకు విశ్రాంతి భవనాలు ఏర్పాటు,  మసీదు కూడా కట్టాలని పదవి అహంకార పూరితతో దళిత, ముస్లింలకు మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నా మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ వివిధ కోత్వాల్ చూస్తున్నారని విమర్శించారు. లేనిపక్షంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉద్యమ కార్యచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి దళితుల ఓట్లు బహుజనుల ఓట్లు వేయకుండా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని విధివిధానాలను ప్రజలకు తెలియజేస్తూ దళిత బహుజన ప్రజలచే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని భూస్థాపితం చేస్తామని ఆగ్రహం వ్యక్తం చేశారు.