13-09-2025 10:11:29 PM
ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి
రూ. 88.50 లక్షల నిధులతో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు
అబ్దుల్లాపూర్ మెట్: ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి అన్నారు. శనివారం అబ్దుల్లాపూర్ మెట్ మండలంలో వివిధ గ్రామాలలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమాలకు హాజరై స్థానిక మాజీ ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలసి ప్రారంభించారు. అబ్దుల్లాపూర్ మెట్ లోని జేఎన్ఎన్యుఆర్ఎం కాలనీలో రూ.20 లక్షలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, రూ.12 లక్షలతో అంగన్వాడీ కేంద్రం, కవాడిపల్లిలో రూ.10 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులు, చిన్న రావిరాలలో రూ.8.50 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులు, ఇనాంగూడలో రూ.6 లక్షలతో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, మజీద్ పూర్ లో రూ.20 లక్షలతో గ్రామ పంచాయతీ భవనం, పిగ్లీపూర్ లో రూ.12 లక్షలతో అంగన్వాడీ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవలు చేశారు. మొత్తం 88.50 లక్షల రూపాయలతో నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని, ప్రతి ఇంటికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడమే ప్రజా ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, మాజీ ప్రజా ప్రతినిధులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.