11 June, 2026 | 12:31 AM

సీసీ రోడ్లు, వీధి దీపాలకు నిధులు మంజూరు

13-09-2025 10:02 PM

చేవెళ్ల: చేవెళ్ల మున్సిపల్, మండల పరిధిలో సీసీ రోడ్లు, వీధి దీపాలకు హెచ్ ఎండిఎ నుంచి  రూ.10  కోట్లు మంజూరయ్యాయి. దీంతో స్థానిక నాయకులు శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎమ్మెల్యే కాలే యాదయ్య చొరవతోనే  నిధులు మంజూరయ్యాయని కొనియాడారు. మున్ముందు మరిన్ని నిధులు తీసుకొచ్చి మండలాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.