01-08-2025 10:21:07 PM
వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు..
హనుమకొండ టౌన్ (విజయక్రాంతి): గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 65వ డివిజన్ పరిధిలోని చింతగట్టు క్రాస్ రోడ్డు వద్ద న్యూ కాకతీయ ఆటో యూనియన్ చింతగట్టు, మునిపల్లె, సుభాస్ నగర్ గ్రామాల ఆటో కార్మికులకు కాంగ్రెస్ నాయకులు ఏరుకొండ శ్రీనివాస్ ఆటో కార్మికులకు చొక్కాలు పంపిణీ చేసే కార్యక్రమానికి వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు(MLA KR Nagaraju), తాడు రాష్ట్ర అధ్యక్షుడు గుడిమల్ల రవి కుమార్ ముఖ్యఅతిథిగా హాజరై కార్మికులకు చొక్కాలు పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే నాగరాజు ప్రపంచ ఆటో కార్మిక దినోత్సవం సందర్భంగా యూనియన్ వారు ఏర్పాటు చేసిన ఆటో ర్యాలీ స్వయంగా ఆటో నడిపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ, గత ప్రభుత్వం ఆటో కార్పోరేషన్ ఏర్పాటు చేసి వారి సమస్యలను పరిష్కరిస్తా అని హామీలకే పరిమితమైందన్నారు కానీ నేడు ప్రజా ప్రభుత్వం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆటో కార్మిక సోదరులకు 12,000 వేల రూపాయలు ఇచ్చే యోచన సన్నహాలు చేస్తూ ముందుకు వెళ్తున్నారన్నారు. నాడు తెలంగాణ రాష్ట్ర సాధనకై ఉద్యమం నిర్వహించి ఆటోలు బంద్ చేసి సకలజనుల సమ్మె భాగస్వామిలవుతూ తెలంగాణ రాష్ట్ర పోరాటంలో తమ వంతు క్రియాశీలక పాత్ర పోషించారన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో హసన్పర్తి మండల కేంద్రంలో ఆటో కార్మిక సోదరులు ఎక్కువ స్థాయి ఉన్నారు.
వారికి అన్ని రకాలుగా అండగా ఉంటూమన్నారూ. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలలో వారికి కూడా నా వంతు సహాయ సహకారాలు అందిస్తామనీ సందర్భంగా ఆటో కార్మికులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కిసాన్ జిల్లా అధ్యక్షుడు వెంకట్రాం నరసింహారెడ్డి, ఆత్మకూర్ ఏఎంసి వైస్ చైర్మన్ తంగెళ్ళపల్లి తిరుపతి, హసన్పర్తి పాక్స్ చైర్మన్ బిల్లా ఉదయ్ కుమార్ రెడ్డి, హసన్పర్తి మండల పార్టీ అధ్యక్షుడు పోరెడ్డి మహేందర్ రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు అయ్యాల రాంరెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ఆటో కార్మికులు, తదితరులు పాల్గొన్నారు.