25-10-2025 06:54:12 PM
కోనరావుపేట,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రంలోని అంబేద్కర్ యువజన సంఘం నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షులుగా యాస శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా పత్కాల రత్నం, కార్యదర్శిగా మందాల అభిషేక్, ప్రధాన కార్యదర్శిగా బత్తుల దీపక్, కోశాధికారిగా అంగూరి శంకర్, సలహాదారుగా పత్కాల ప్రకాశం, యాస సదానందం, మాందాల లింబయ్య, మధునాల ముత్తయ్య, మాసం అర్జున్, లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.
ఈ ఎన్నికకు మాల మహానాడు మండల అధ్యక్షులు మాందాల శ్రీనివాస్ హాజరై శాలువాతో సన్మానం చేయడం జరిగింది.ఈ సందర్భంగా అంబేద్కర్ యువజన సంఘం అద్యక్షులు యాస శ్రీనివాస్ మాట్లాడుతూ నాపై నమ్మకముంచి నా ఎన్నికకు సహకరించిన నా మాల సోదరులకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ నాకిచ్చిన బాధ్యతను సక్రమంగా నిర్వర్థిస్థానని అన్నారు.