calender_icon.png 26 October, 2025 | 5:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సొంత ఊరి కోసం సినీ నటుడు సంజోష్ చేస్తున్న సేవ కార్యక్రమం బాగుంది

25-10-2025 06:55:29 PM

ఏటూరునాగారం నిర్వహించిన ఉచిత కంటి పొర చికిత్స శిబిరం..

సంజోష్ ను అభినందించిన ములుగు జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్..

ములుగు (విజయక్రాంతి): ములుగు జిల్లా ఏటూరునాగారంలోని ఐటిడిఏ గిరిజన భవనంలో శంకర నేత్రాలయ MESU హైదరాబాద్, సంజోష్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి పొర చికిత్స శిబిరాన్ని ములుగు జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్. సందర్శించారు. శిబిరంలో చికిత్స చేయించు కోవడానికి దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారి వివరాలు తెలుసుకున్నారు. కంటి పరీక్ష కేంద్రం వద్ద వైద్యులకు పలు సూచనలు ఇచ్చారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మారుమూల ప్రాంతాల్లో కంటి శస్త్ర చికిత్స శిబిరం ఏర్పాటు చేయడం, ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని  అన్నారు. తన సొంత ఊరి కోసం సినీ నటుడు హీరో సంజోష్ చేస్తున్న సేవ కార్యక్రమాలను కలెక్టర్ సంజోష్ ను అభినందించారు. ప్రతి ఒక్కరు సంజోష్ చేస్తున్న సేవ కార్యక్రమాలను స్పూర్తిగా తీసుకోవాలని అన్నారు. ఇప్పటి వరకు కంటి చూపు పొర చికిత్స పరీక్షల కోసం 590మంది పరీక్షలు చేయించుకున్నారని, వారిలో 110 మంది శస్త్ర చికిత్సకు అర్హులు అయ్యారని సంజోష్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు సినీ నటుడు సంజోష్ తెలిపారు.