10-11-2025 08:05:43 PM
మంథని మండలంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంత్సవంలో ఏఎంసీ చైర్మన్ వెంకన్న, పీఏసీ ఎస్ చైర్మన్ శ్రీనివాస్
మంథని (విజయక్రాంతి): రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ద్యేయమని ఏఎంసి చైర్మన్ కుడుదుల వెంకన్న, సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ అన్నారు. ఐటి, పరిశ్రమలు, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, టిపిసిసి ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ళ శ్రీను బాబు ఆదేశాల మేరకు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో మంథని మండలం కన్నాల, ఖానాపూర్, గోపాల్ పూర్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏఎంసి చైర్మన్ కుడుదుల వెంకన్న, గుంజపడుగు, నాగారం, గద్దలపల్లి, బిట్టుపల్లి, చిన్న ఓదాల, విలోచవరం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ సోమవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు వరి ధాన్యాన్ని ఆర బెట్టుకోవడానికి మంథని ఏఎంసిలో రైతుల సౌకర్యార్ధం రూ.28లక్షల వ్యయం తో 2 ప్యాడి డ్రై మిషన్స్ అందుబాటులోకి తీసుకువచ్చామని, రైతులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా మంత్రి శ్రీధర్ బాబు జిల్లా యంత్రాగాన్ని ఆదేశిoచారని, దేశం లో, రాష్ట్రంలో గొప్ప నాయకులలో మంత్రి శ్రీధర్ బాబు ఒకరని అన్నారు.
శ్రీదర్ బాబు డిల్లిలో ఉన్నా, హైదారాబాద్ లో ఉన్నా మంథని ప్రాంత రైతులు, ప్రజల అవసరాలను తీర్చడంలో ముందున్నారని, ఏ గ్రామంలో జరగాల్సిన అభివృద్ధి ఆ గ్రామం లో జరుగుతుందని, వేర్వేరుగా జరిగిన ఈ కార్యక్రమాల్లో సంఘ డైరెక్టర్లు ఆకుల రాజబాబు, రావికంటి సతీష్ కుమార్, లెక్కల కిషన్ రెడ్డి, దాసరి లక్ష్మి-మొండయ్య, ఉడుత మాధవి- పర్వతాలు యాదవ్, దేవల్ల విజయ్ కుమార్, ఏఎంసి ఉపాధ్యక్షుడు ముస్కుల ప్రశాంత్ రెడ్డి, డైరెక్టర్లు ఊధరి శంకర్, మాజీ ఎంపిపి కొండ శంకర్, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు ముస్కుల సురేందర్ రెడ్డి, ఏఎంసి మాజీ చైర్మన్ ఆకుల కిరణ్, నాయకులు బూడిద శంకర్, బూడిద మల్లేష్, ఊధరి శంకర్, చంద్రు రాజమల్లు, నాగుల రాజయ్య, సేమంతుల ఓదెలు, దొరగొర్ల శ్రీనివాస్, ఆరెల్లి కిరణ్ గౌడ్,సాదుల శ్రీకాంత్, ఇందారపు అనిల్, సదయ్య, బొల్లి శంకర్ ఉదరి లచ్చన్న, అక్కపాక సది, ఎరుకల ప్రవీణ్, పెంటరి రాజు, పొయిల రాజయ్య, బాస అశోక్, ముస్కుల రమేష్ రెడ్డి, గుడిసె గట్టయ్య, పుల్లె రవి, పెరటి పాపిరెడ్డి, పొయిల శేఖర్, గుడిసె రాజయ్య, మద్దెల చంటయ్య, కోరవేన రవి, రోడ్ద రాజేశ్వర్ రావు, రాగం శ్రీనివాస్, కోరవేన మధుకర్, సుంకరి మల్లికార్జున్, మోతుకు బాపు, సంతోష్, గేల్లు మల్లేష్, దాసరి రాములు, కొప్పుల రాజయ్య, లట్ట మహేష్, వైనాల కిరణ్, పుట్ట సుధాకర్, కనగంటి ఓదెలు,శంకరయ్య, పోగుల మహేందర్, కాంగ్రెస్ నాయకులూ, కార్యకర్తలు, రైతులు, హమలిలు, తదితరులు పాల్గొన్నారు.