11న వికారాబాద్‌కు అమిత్ షా
విశ్వేశ్వర్‌రెడ్డి విజయం ఖాయం: బీజేపీ నాయకులు
వికారాబాద్, మే 8 (విజయక్రాంతి): లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 11న కేంద్ర హోంమంత్రి అమిత్ షా వికారాబాద్‌కు వస్తున్నట్టు చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, బీజేపీ జిల్లా అధ్యక్షుడు మాధవరెడ్డి తెలిపారు. బుధవారం వారు మీడియాతో మాట్లాడుతూ.. ఈ నెల 11న మధ్యా హ్నం 2 గంటలకు ఎస్‌ఏపీ కళాశాల మైదానంలో బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. ఈ సభకు కేంద్ర హోంమంత్రి హాజరవుతున్నట్టు తెలిపారు. చేవెళ్లలో నూటికి నూరుశాతం బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి విజయం సాధిస్తారని చెప్పారు. అవినీతి, అక్రమాలు చేసే కాంగ్రెస్ అభ్య ర్థి రంజిత్‌రెడ్డిని ఎంపీగా ఎన్నుకుంటే తీవ్ర నష్టం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ బీజేపీకి ఓటు వేసి కొండాను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. సమావేశంలో బీజేపీ సీనియర్ నాయకులు శివరాజ్, నవీన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.




