బీఆర్‌ఎస్ గెలుపు ఖాయం
09-05-2024 12:46 AM
నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి
నారాయణఖేడ్, మే 8: జహీరాబాద్ ఎంపీగా బీఆర్‌ఎస్ అభ్యర్థి గెలుపు ఖా యమని నారాయణఖేడ్ మాజీ ఎమ్మె ల్యే ఎం భూపాల్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆయన నియోజకవర్గంలోని కడ్పల్, మనూరు మండలంలోని రాయిపల్లి, ధన్వార్, ఉసిరికెపల్లి గ్రామా ల్లో ప్రచారం నిర్వహించారు. పార్టీ అభ్య ర్థి గాలి అనికుమార్‌కు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాని కోరారు. కాంగ్రె స్, బీజేపీల మాటలను నమ్మి మోసపోవద్దని సూచించారు. ఖేడ్‌ను తన హయాంలో అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానని గుర్తుచేశారు. ప్రచారంలో పార్టీ మండల అధ్యక్షుడు సంజీవ్‌రావుపాటిల్, విఠల్‌రావు పాటిల్, కోఆప్షన్ సభ్యుడు సలీం, సాయగౌడ్, యాదవరావు తదితరులు పాల్గొన్నారు.




