23-05-2025 04:18:43 PM
బెల్లంపల్లి అర్బన్,(విజయక్రాంతి): బెల్లంపల్లి మున్సిపాలిటీలో అమృత్ మిత్ర కార్యక్రమంలో భాగంగా శుక్రవారం విమెన్ ఫర్ ట్రీస్ ప్రోగ్రాం నిర్వహించారు. బెల్లంపల్లి మున్సిపల్ కమీషనర్ శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరైమాట్లాడారు. బెల్లంపల్లి మున్సిపాలిటీలో కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం తలపెట్టిన అమృత్ మిత్ర కార్యక్రమములో భాగంగా విమెన్ ఫర్ ట్రీస్ కార్యక్రమo చేపట్టమన్నారు. స్వయం సహాయక సంఘ సభ్యుల ద్వారా మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యతల గురించి వివరించారు.
మొక్కలు నాటి వాటి బాగోగులు చూసుకునే బాధ్యత కూడా మహిళా సంఘ సభ్యులదే నన్నారు. అందుకు గాను అట్టి స్వయం సహాయక సంఘానికి ఆర్థిక సహకారం కూడా అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేనేజర్, ఆర్వో ప్రవీణ్, సునిల్, మెప్మా పట్టణ సమన్వయ అధికారి దుర్గయ్య, సీవో కిషోర్ ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ సంతోష్ , మెప్మా రిసోర్సు పర్సన్లు స్వయం సహాయక సంఘం సభ్యులు పాల్గొన్నారు.