calender_icon.png 23 May, 2025 | 11:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిరుపేదలకు గౌసుద్దీన్ ఆర్థిక సాయం

23-05-2025 04:15:36 PM

మృతుల కుటుంబాలకు గౌసుద్దీన్ చేయుత..

వైరా, (విజయక్రాంతి): కారేపల్లి గ్రామానికి చెందిన గుర్రం వీరస్వామి  కుటుంబానికి ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ మైనార్టీ నాయకులు షేక్ గౌసుద్దీన్ 50కేజీల బియ్యంతో పాటు 5వేల రూపాయలను ఆర్ధిక సహాయంగా అందజేశారు. ఆపద అనే పదం చెవిలో పడేలోపే, నేను ఉన్నాను అని తనవంతు సహాయం చేయడానికి ముందు ఉండే మనిషీ  షేక్ గౌస్ ద్దీన్.   ఆపదలో ఉన్నారని తెలిస్తే, తన సొంత నిధులతో క్షణం కూడా ఆలోచన చేయకుండా తనవంతుగా, ఏదో రూపంలో సహాయం చేయడానికి వెనుకాడని  వ్యక్తి  గౌసుద్దీన్ అని పలువురు ఆయన సేవ గుణాన్ని కొనియాడారు. 

ఈ సందర్భంగా గౌసుద్దీన్ మాట్లాడుతూ...  కారేపల్లి పాత మాల బజార్ చెందిన గుర్రం  వీరస్వామి మరణ వార్త చాలా బాధాకరమని వారి కుటుంబానికి ఎల్లప్పుడు అండగా ఉంటామని అయన అన్నారు. ఆపదలో ఉన్నావారు ఏ గ్రామాలలో ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని గౌస్ దీన్ పేర్కొన్నారు. పేదవారి కుటుంబాలలో తన  వంతు ఆర్థిక సాయం చేయడానికి నేను ఎల్లప్పుడు ముందు ఉంటానని  పేర్కొన్నారు. కారేపల్లి గ్రామంలో వివిధ కారణాలతో మృతి చెందిన కుటుంబాలను పరామర్శించి మనోధైర్యాన్ని కల్పింఛారు. ఈ కార్యక్రమంలో  డొంకెన రవీందర్ గౌడ్ తెలంగాణ ఉద్యమాలు నాయకు  జుంకీలాల ,ఎండి. కలియుల్లా ఖాన్, రామకృష్ణ, సురేష్ రాకేష్, గుర్రం సుబ్బయ్య, పాస్టర్ తదితరులు పాల్గొన్నారు