calender_icon.png 23 July, 2025 | 11:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

2కే రన్ ప్రారంభించిన అదనపు కలెక్టర్

03-12-2024 07:38:28 PM

నిర్మల్ (విజయక్రాంతి): ప్రజాపాలన విజయోత్సవాల భాగంగా మంగళవారం నిర్మల్ పట్టణంలో నిర్వహించిన 2కే రన్ ను జిల్లా అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ ప్రారంభించారు. పట్టణంలోని ఎన్టీఆర్ మున్సిపల్ లో జెండా ఊపి రన్ ను ప్రారంభించిన కలెక్టర్ విద్యార్థులు, ఉద్యోగులతో కలిసి రన్ లో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఏడాది పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేసిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సయ్యద్ కమార్, అధికారులు రామారావు, శ్రీకాంత్ రెడ్డి, సుభాష్, రాజమల్లు, రమేష్, రాజు పాల్గొన్నారు.