calender_icon.png 24 July, 2025 | 5:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బెల్లంపల్లి సబ్ కలెక్టర్ గా మనోజ్ నియామకం..

23-07-2025 10:30:07 PM

బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా(Mancherial District) బెల్లంపల్లి రెవెన్యూ డివిజన్ కి మరోసారి ఐఏఎస్ స్థాయి అధికారిని నియమించారు. నూతన సబ్ కలెక్టర్ గా ఐఈఎస్ ఎస్ డి మనోజ్ ను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. 2023 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన మనోజ్ రెండు రోజుల్లో ఉద్యోగ బాధ్యతలు చేరనున్నారు. నూతనంగా ఆవిర్భవించిన బెల్లంపల్లి రెవెన్యూ డివిజన్ కి మొదటి సబ్ కలెక్టర్ గా పిఎస్ రాహుల్ రాజ్ ను నియమించారు. 2018 నుంచి 2020 వరకు సబ్ కలెక్టర్ గా పీ ఎస్ రాహుల్ రాజ్ పనిచేశారు. రాహుల్ రాజు బదిలీ తర్వాత ఆర్డీవో స్థాయి అధికారులు పనిచేస్తున్నారు. ఆర్డిఓ పి హరికృష్ణ కూడా వదిలేయ్యారు. ఇప్పటివరకు ప్రభుత్వం ఆయనకు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. ఆయన స్థానంలో బెల్లంపల్లి రెవెన్యూ డివిజన్ కు నూతన ఐఏఎస్ అధికారి ని సబ్ కలెక్టర్ గా ప్రభుత్వం నియమించడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.