23-07-2025 10:41:13 PM
కామారెడ్డి (విజయక్రాంతి): తెలంగాణ విశ్వవిద్యాలయం(Telangana University) వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్. యాదగిరి రావు డా. కవిత తొరన్ ను అభినందించారు. ఓపెన్ సోర్స్ జిఐఎస్ టెక్నాలజీని అత్యుత్తమంగా ఉపయోగించినందుకు ఐఐటి బాంబే వారు ఈ నెల 17న డా. కవిత తోరాన్ కు జియోస్పేషియల్ ఫ్యాకల్టీ ఫెలో అవార్డు అందించారు. దేశంలోనే కేవలం 22 మంది అత్యుత్తమ ప్రతిభ కలిగిన వారికి మాత్రమే ఈ అవార్డు లభిస్తుంది. ప్రస్తుతం ఆమె సౌత్ క్యాంపస్ జియో ఇన్ఫర్మేషన్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా విధులు నిర్వహిస్తున్నారు. అవార్డు అందుకున్న ఆమెకు యూనివర్సిటీ అధ్యాపకులు, విద్యార్థులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఈ అవార్డు పొందడానికి సహాయ సహకారాలు అందించిన టి.యూ విసికి, రిజిస్ట్రార్ కు కృతజ్ఞతలు తెలిపారు.