23-07-2025 10:27:07 PM
సస్పెండ్ చేసిన జిల్లా ఎస్పీ..
నల్లగొండ టౌన్ (విజయక్రాంతి): నల్లగొండలో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న కానిస్టేబుల్ ఖలీల్(Constable Khalil)పై ఎస్సీ, ఎస్టీ ఆక్ట్ కింద వన్ టౌన్ పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. ఈయన ప్రస్తుతం చండూర్ పోలీస్ స్టేషన్(Chandur Police Station)లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. నల్లగొండ 1-టౌన్ పోలీస్ స్టేషన్ లో మహిళ భర్త పెంజర్ల రవి కుమార్ ఫిర్యాదు చేశారు. వాట్సాప్ చాటింగ్ తో పాటు మరికొన్ని ఆధారాలు ఆమె భర్త పోలీసులకు అందించారు. వీరి ఇద్దరి మధ్య అడ్డుగా ఉన్నాననే నెపంతో తనను చంపాలని చూస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గతంలోనూ ఖలీల్ పై అనేక ఆరోపణలు, ఫోన్ ట్యాపింగ్ కేసులోను ఖలీల్ పేరు ప్రస్తావన రావడంతో స్పెషల్ టీం ఆయనపై విచారణ చేపడుతున్నారు. ఖలీల్ పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆయనను సస్పెండ్ చేశారు.