23-07-2025 10:32:13 PM
పెన్ పహాడ్: సూర్యాపేట జిల్లా(Suryapet District) పెన్ పహాడ్ మండలంలో గత మూడు రోజులుగా కురుస్తున్న చిన్నప్పటి వర్షాలకు మండలంలోని అనాజిపురం-దోసపహాడ్ ప్రధాన రహదారి గుంతల పడి బురదమయంగా మారాయి. గ్రామంలోని ఉన్నత పాఠశాల నుంచి గ్రామ శివారు వరకు రహదారి అస్తవ్యస్తంగా మారడంతో గ్రామస్తులు నడవలేని దుస్థితి నెలకొన్నది. అందుకు నిరసనగా గ్రామ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గ్రామస్తులు వరి నాట్లు వేసి నిరసన కార్యక్రమం తెలిపారు. ప్రభుత్వం వెంటనే రహదారి మరమ్మతులు చేపట్టి గ్రామస్తులకు వాహనదారులకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు.