23-07-2025 10:20:19 PM
జయశంకర్ భూపాలపల్లి (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా(Jayashankar Bhupalpally District) వ్యాప్తంగా విత్తనాలు ఎరువులు దుకాణంలో పోలీసు తనిఖీలు నిర్వహించారు. బుధవారం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు వ్యవసాయ శాఖ అధికారులు, తహసీల్దార్లతో సంయుక్తంగా జిల్లా వ్యాప్తంగా ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న విత్తన, ఎరువుల స్టాక్ పై తనిఖీలు నిర్వహించారు. తనిఖీలలో భాగంగా ఎరువుల సంచులపై ఉన్న లేబుల్ తో పాటు లేబుల్లో ఉన్న వివరాలు వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. గోదాములలో నిలువ ఉంచిన విత్తన సంచుల ఎరువుల వివరాలను సేకరించారు. లైసెన్స్ వివరాలను అలాగే ఎరువుల సంచులను సరఫరా చేసిన కంపెనీ వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఫెర్టిలైజర్స్ షాపుల్లో ప్రతి రోజు తనిఖీలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ తనిఖీలలో ఆయా పోలీస్ స్టేషన్ల ఎస్ఐ లు, తహసీల్దార్లు, వ్యవసాయ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.