26-12-2025 07:03:33 PM
జవహర్ నగర్,(విజయక్రాంతి): ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్యూ) మేడ్చల్ డివిజన్ నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ మేరకు పీడీఎస్యూ జాతీయ నాయకులు మహేష్ ఆధ్వర్యంలో శుక్రవారం నూతన అధ్యక్షుడిగా కామ్రేడ్ తీగల శ్యామ్, ప్రధాన కార్యదర్శిగా కామ్రేడ్ యశ్వంత్ లని ప్రకటించారు. ఈ సందర్భంగా కామ్రేడ్ శ్యామ్ మాట్లాడుతూ విద్యా విధానాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న తీరును ప్రజాక్షేత్రంలో ఎండగడుతూ శాస్త్రీయ విద్యాసాధనకై పోరాడుతామని అన్నారు. కోశాధికారిగా గాయత్రి, సభ్యులుగా శ్రీకాంత్, వేణు, చందు, శివ, నటాషా, కోఆప్షన్ సభ్యులు ఎన్నికయ్యారు.