calender_icon.png 26 December, 2025 | 8:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్సైని సన్మానించిన వెల్గటూర్ సర్పంచ్

26-12-2025 07:08:26 PM

వెల్గటూర్,(విజయక్రాంతి): వెల్గటూర్ మండల ఎస్సైగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన పులిచెర్ల ఉదయ్ కుమార్ ను గ్రామ సర్పంచ్ బండమీది కవితగోపి మర్యాద పూర్వకంగా కలిసి శాలువతో సన్మానించారు. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీస్ శాఖకు గ్రామ సర్పంచ్ గా తమవంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. గ్రామంలో ఉన్నటువంటి పలు సమస్యలను సర్పంచ్ ఎస్సై దృష్టికి తీసుకెళ్లారు.

సమస్యల పరిష్కారంకై పోలీస్ శాఖ త్వరగా చర్యలదిశగా అడుగులేస్తుందనీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా నూతనంగా సర్పంచ్ గా ఎన్నికై, బాధ్యత లు చేపట్టిన బండమీది కవితగోపి కి ఎస్సై శుభాకాంక్షలు తెలిపారు. మండలంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా, శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో పోలీస్ శాఖకు ప్రజలు, ప్రజా ప్రతినిధులు సహకరించాలనీ, ఆ దిశగా మండల ప్రజలు, ప్రజా ప్రతినిధుల నుండి పూర్తి సహకారం అందుతుందనీ ఎస్సై ఉదయ్ కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు.