calender_icon.png 26 December, 2025 | 8:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శబరిమల క్షేత్రంలో ఎమ్మెల్యే కోవ లక్ష్మి

26-12-2025 06:56:18 PM

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): భక్తిశ్రద్ధలతో అయ్యప్ప స్వామి సన్నిధిలో  ఎమ్మెల్యే కోవ లక్ష్మి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిష్టతో ఇరుముడి కట్టుకుని కేరళలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శబరిమల చేరుకున్నారు. ఎమ్మెల్యే తన బృందంతో కలిసి పదునెట్టాంబడి (18 మెట్లు) ఎక్కి మణికంఠ స్వామిని దర్శించుకున్నారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు, పలువురు భక్తులు పాల్గొన్నారు.