calender_icon.png 1 January, 2026 | 4:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విజయవంతంగా విజయక్రాంతి నూతన క్యాలెండర్ ఆవిష్కరణ

01-01-2026 02:13:06 AM

గుమ్మడిదల, డిసెంబర్ 31: ప్రజల సమస్యలపై అధికారులకు ప్రజలకు సమాచారం చేరడంలో విజయక్రాంతి పత్రిక విశేష కృషి చేస్తోందని గుమ్మడిదల మండల తహసిల్దార్ ఎం. పరమేశం, మున్సిపల్ కమిషనర్ దశరథ్ కుమార్, ఎస్త్స్ర లక్ష్మీకాంత్ రెడ్డి, శ్రీ వివేకానంద ఆచార్య ఉన్నత పాఠశాల కరస్పాండెంట్ లతా జైపాల్ రెడ్డి అన్నారు. బుధవారం వారి చేతుల మీదుగా విజయక్రాంతి పత్రిక 2026 నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ పత్రికలు ప్రజల పక్షాన మాత్రమే ఉండాలని, నిస్వార్ధంగా నిబద్ధతతో వార్తలు రాయాలని నిజాన్ని నిర్భయంగా వార్తలు రాస్తూ ప్రభుత్వానికి ప్రజలకు వారిదిగా నిలవాలని సూచించారు. విజయక్రాంతి దినపత్రిక ప్రజల మన్ననలు పొందా లని కోరుతూ యాజమాన్యానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో గుమ్మడిదల విలేకరి రమేష్ తదితరులు పాల్గొన్నారు.