calender_icon.png 13 January, 2026 | 11:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్వాభిమాన పోరాటానికి స్ఫూర్తి!

01-01-2026 12:00:00 AM

పుల్లెంల గణేష్ :

భీమా కోరెగావ్ యుద్ధ విజయానికి గుర్తుగా నేడు శౌర్య దివస్ :

మానవ సమాజ నాగరికత ఆవిర్భావం నుంచి అనేక భీకర యుద్ధాలు జరిగాయి. అయితే అవన్నీ కూడా సామ్రాజ్యవాద దృక్పథంతో జరిగిన యుద్ధాలే కానీ ఆత్మగౌరవం, స్వాభిమానం కోసం జరిగిన పోరాటాలు అరుదుగా కనిపిస్తుంటాయి. అలాంటి వాటిలో భీమా కోరె గావ్ యుద్ధానికి తప్పకుండా ప్రత్యేక స్థానముంటుంది. చరిత్ర భయపడేలా, శత్రువుల గుండెల్లో దడ పుట్టించేలా సాగిన భీమా కోరెగావ్ యుద్ధం జరిగి రెండు శతాబ్ధాలు దాటిపోయినప్పటికీ ఆ జ్ఞాపకాలు మాత్రం ఆ ప్రాంతంలో నిర్మించిన విజయస్థూపం రూపంలో అక్కడి ప్రజల్లో మెదులుతూనే ఉంటాయనడంలో సందేహం లేదు.

ప్రపంచవ్యాప్తంగా భారత్ సహా అన్ని దేశాలు జనవరి ఒకటిని నూతన సంవత్సరాన్ని ఒక పండుగలా జరుపుకుంటాయి. కానీ భారత్‌లోని షెడ్యూల్ కులాలకు చెందిన చమర్, మహర్ కులస్తులకు మాత్రం జనవరి ఒకటి అంటే గుర్తుకు వచ్చేది నూతన సంవత్సరం కాదు.. భీమా కోరెగావ్ యుద్ధానికి విజయంగా చేసుకునే శౌర్య దివస్ మాత్రమే. పీష్వా రాజ్యం ఎప్పుడు ఉనికిలోకి వచ్చిం ది..? మహర్లు, చమర్లు యుద్ధం ఎందుకు చేయవలసి వచ్చింది..? బ్రిటిష్ సైన్యంతో కలిసి అస్పృశ్యులైన చమర్లు, మహర్లు యుద్ధం ఎందుకు చేశారు..? ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానాలు దొరకాలంటే చరిత్రలోకి తొంగి చూడాల్సిందే. 

కఠిన నిబంధనలు..

భారత రాజ్యాంగానికి ముందు ఉన్న మనుధర్మ శాస్త్రం ప్రకారం శూద్రులకి ముఖ్యంగా నాలుగు హక్కులు ఉండేవి కావు. అవి ఆస్తి హక్కు, ఆయుధం హక్కు, చదువు హక్కు, రాజ్యపాలన హక్కు. ఇవి శూద్రులకు నిరాకరించబడ్డాయి. ఈ నాలు గు హక్కులు అణగారిన ప్రజలకి, స్త్రీలకు కూడా లేవు. ఈ నాలుగు హక్కులపై బ్రాహ్మ ణ, క్షత్రియ, వైశ్య కులాలకు మాత్రమే మనుధర్మ శాస్త్రం హక్కులను ఇచ్చింది. అత్యంత క్రూరమైన అంటరానితనం పీష్వా బ్రాహ్మణ రాజ్యమైన పుణే ప్రాంతంలో జరిగింది. దళితుల నీడ కూడా అగ్రవర్ణాలపై పడకూడద ని, దళితులు పొద్దున, సాయంత్రం అగ్రవర్ణాల వారి ఇండ్లకు కానీ, వారి దగ్గరకు కానీ పోకూడదని నిబంధన ఉండేది. 

అంతేకాదు ఒకవేళ బయటికి వెళ్లాలనుకుంటే తన నీడ తనపైన పడే పట్టపగలు మాత్రమే వెళ్లాలనే దుర్మార్గపు ఆంక్షలు ఉండేవి. అలా దేశ మూలవాసి ప్రజలను పీష్వా బ్రాహ్మణులు నీచమైన బానిసత్వానికి గురి చేస్తూ వచ్చేవారు. దీనితో వేల సంవత్సరాల బానిస సంకెళ్లు తెంచుకోవడానికి ప్రతిజ్ఞ చేసిన 500 మంది మహార్, చమర్ పోరాటయోధులు సమర శంఖానికి సిద్ధమయ్యారు. 

పారిపోయిన పీష్వా సైన్యం..

దాదాపు 200 మంది బ్రిటీష్ సైన్యంతో కలిసి రెండువందల కిలోమీటర్లు నడిచిన చమర్, మహార్ సైన్యం భీమా నది ఒడ్డుకు చేరుకున్నారు. అప్పటికే అక్కడికి చేరుకున్న 20వేల మంది పదాతిదళం, 8 వేల మంది అశ్విక దళంతో కనుచూపు మేరలో కనిపిస్తున్న పీష్వా సైన్యాన్ని చూసి బ్రిటిష్ సైన్యం భయపడి అక్కడి నుంచి జారుకుంది. అయితే బతికితే పోరాట వీరులుగా బతకాలని లేదంటే హీనమైన బతుకులతో చావా లని నిర్ణయించుకున చమర్, మహార్ సైన్యం పీష్వా సైన్యంతో యుద్ధానికి సిద్ధమయ్యారు.

తిండిలేక కాలినడకన వచ్చిన మహార్ సైన్యం సింహాల్లాగా పీష్వా సైన్యాన్ని పరిగెత్తించారు. విరామం లేకుండా సాగిన భీకర యుద్ధంతో భీమా నది పీష్వా సైనికుల రక్తంతో ఎర్రబడింది. పీష్వా సైన్యాధ్యక్షుడి కొడుకైన గోవిం ద్ బాబా తలను నరికి మొండాన్ని వేరు చేసి పీష్వా సైన్యం వైపు విసిరారు. ఇది చూసిన పీష్వా సైనికులు భయంతో శిబిరం వైపు పారిపోయారు. అలా 1818, జనవరి 1వ తేదీన మహార్, చమర్ సైన్యం పీష్వాలపై ఘన విజయం సాధించింది.

అయితే 200 సంవత్సరాల క్రితం జరిగిన భీమా కోరెగావ్ యుద్ధం గాయం ఇంకా మానలేదని చెప్పొ చ్చు. ఇప్పటికీ దళితులు, అగ్రవర్ణాల మధ్య తారతమ్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. గత ఆరు సంవత్సరాల క్రితం భీమా కోరేగావ్‌లో జరిగిన అల్లర్లు చూస్తే దళితుల పట్ల అగ్రవర్ణాల అసహనం స్పష్టంగా కనిపిస్తుంది.

ఆత్మగౌరవానికి ప్రతీక..

మొత్తంగా భీమా కోరెగావ్ యుద్ధం చూసుకుంటే.. ఆనాటి నుంచి నేటి వరకు మానవ చరిత్రలోనే అత్యద్భుతమైనది, నమ్మశక్యం కాని యుద్ధంగా పేర్కొనవచ్చు. ఆత్మగౌరవం కోసం, మానవ హక్కుల కోసం, మనిషిగా ఒక గుర్తింపు కోసం చేసిన యుద్ధమిది. సువర్ణ అక్షరాలతో రాయదగిన సంఘటన భీమా కోరెగావ్ యుద్ధం. అందు కే ఆనాటి భీమా కోరెగావ్ యుద్ధంలో అమరులైన 12 మంది మహార్ సైనికుల వీరోచిత పోరాటం తరతరాలకు తెలిసేలా బ్రిటిష్ పాలకులు ‘క్రాంతి స్తంభం’ పేరుతో స్మారక స్థూపం నిర్మించారు.

యుద్ధం అనంతరం ఈస్ట్ ఇండియా కంపెనా మహార్ రెజిమెం టు, చమర్ రెజిమెంటు అనే రెండు సైనిక పటాలను ఏర్పాటు చేశారు. సైన్యంలో పని చేసిన వాళ్లకు భూములు ఇచ్చారు. చట్ట బద్ధంగా వచ్చే అన్ని సౌకర్యాలు కల్పించారు, వారి కుటుంబల కోసం విద్యాసంస్థలు ఏర్పాటు చేశారు. అంతేకాదు ప్రతి ఏటా అప్పట్లో బీసీల హక్కుల కోసం పాటుపడిన మహాత్మా జ్యోతిరావు పూలే.. బీమా కోరేగా వ్ ‘క్రాంతి స్తంభం’ దగ్గర నిత్యం సమావేశాలు నిర్వహించేవారు. 1927 జనవరి 1న భీమా కోరెగావ్ స్థూపాన్ని తొలిసారి సందర్శించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఈ స్థూపా న్ని దళితుల ఆత్మగౌరవానికి ప్రతీకగా పేర్కొన్నారు. 

గుర్తింపు అవసరం..

అయితే ఆనాటి మనుధర్మ శాస్త్ర పీష్వా పాలకుల మూలంగా సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా, సాంస్కృతికంగా అణగ దొక్కబడిన దళితులు ఎలాంటి మానవ హక్కులు, పౌర హక్కులు లేకుండానే జీవించాల్సి వస్తోంది. సగటు మనిషిగా కూడా గుర్తింపు కూడా లేకపోయేది. అంటరాని వారిగా బతుకుతున్న మహార్, చమర్ వీరులని బ్రిటిష్ సైన్యం కోసం పనిచేసిన వ్యక్తు లుగా కాకుండా భారతదేశంలో పుట్టి పెరిగి మూలవాసులుగా, దేశ నిర్మాతలుగా పేరొందిన వ్యక్తులుగా గుర్తించాల్సిన అవసరముం ది.

ఈ దేశ అగ్రవర్ణ బ్రాహ్మణ పీష్వాల అసమానత పాలనకు అభిముఖంగా ‘ఆత్మగౌర వం’ కోసం నాడు చమర్, మహార్ వీరులు విరోచిత పోరాటం చేశారని గ్రహించాలనేది అనేక మంది తాత్వికుల, ప్రజాస్వామ్య వాదుల అభిప్రాయంగా నేటి సమకాలీన మేధావులు, విద్యావంతులు, సామాన్యులు గ్రహించాల్సిన చారిత్రక సత్యం.

 వ్యాసకర్త సెల్: 9553041549