calender_icon.png 13 January, 2026 | 9:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సవాళ్లు దాటితేనే లక్ష్యాలు సాధ్యం!

01-01-2026 12:00:00 AM

డాక్టర్ సంగని మల్లేశ్వర్ :

ఎన్నికల సమయంలో కామారెడ్డి డిక్లరేషన్ సభలో 60 శాతానికి పైగా ఉన్న బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఒక కొలిక్కి తెచ్చినా కార్యరూపం దాల్చలేదు. అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి రిజర్వేషన్ వ్యతిరేకులను ఎండగట్టే ప్రయత్నం చేయలేదనే భావం బీసీ సమాజంలో ఉంది. ఈ ఏడాదైనా రిజర్వేషన్ల అమలులో అండగా నిలుస్తుందేమోననే బీసీలు ఆశతో ఎదురుచూస్తున్నారు. 

కొత్త ఏడాది ఆశలు.. మరెన్నో ఆకాంక్షలు. వీటి వెంటే సరికొత్త సవాళ్లు. సాగు నీరు పంపకాలు కొలిక్కిరావాలని, గతం కంటే మరింత సంతృప్తిగా పంట దిగుబడి ధర చేతికి అందాలని రైతు లు.. రెండేళ్లుగా నామినేటెడ్ కుర్చీకోసం ఎదురుచూస్తున్న నేతలు.. చదువులో రాణించాలని విద్యార్థులు.. ఇలా అందరూ ఆంగ్ల సంవత్సరానికి అంతటా జేజేలు పలికేందు కు సమాయత్తమయ్యారు. గత అనుభవాల క్రీనీడల నుంచి సరికొత్త వెలుగులు తెచ్చే ఈ కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతున్న తీరును ఊహించడానికి నాలుగు కోట్ల గుండెలు చాలవేమో.

పాత సంవత్సరం దరి చేరని ఆశలు ఈ ఏడాది పొడుగునా సరికొ త్త లక్ష్యాలను చేరుకోవాలనే ఆకాంక్ష బలం గా అందరిలో ఉన్నది. 2023లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన నాటి నుంచి సరికొత్త పాఠా లు నేర్వడంతో పాటు విద్యార్థులు, ఉద్యోగు లు, కార్మికులు, మహిళలు, రైతులు.. ఇలా అన్ని వర్గాలు రాణించేలా కాంగ్రెస్ ప్రభు త్వం ముందు అనేక సవాళ్లు పొంచి ఉన్నా యి.గత ఏడాది ఒక్కొక్కటిగా అమలు చేస్తూ, పాత వాసనలు వదిలిస్తూ, ఒక్కొ అడుగు ముందుకేస్తూ కొత్త ఏడాదిలోకి రేవంత్ ప్రభుత్వం అడుగు పెడుతోంది.

కాంగ్రెస్ ప్రభుత్వానికి సవాళ్లు అనేవి సంస్కరణలకు నాంది కావాలి. సాగు, తాగునీటికి ముం దస్తు ప్రణాళిక.. నూతన విజయాల అంకురార్పణకు ఇదే సమయం. సరికొత్త సవాళ్లు అధిగమించే ప్రయత్నంలో  ‘క్యూర్’ హైదరాబాద్ లాంటి మహానగరంలో వాణిజ్యం, ఐటి, పరిశ్రమలకు ప్రాధాన్యం, ‘ప్యూర్’ పేరుతో రాష్ర్టంలోని ప్రధాన పట్టణాల మౌలిక సదుపాయాల కల్పన, ‘రేర్’ గ్రామీ ణ అభివృద్ధిలో కీలక భూమిక పోషిస్తున్న వ్యవసాయ రంగంపై దృష్టి పెట్టింది. ‘తెలంగాణ రైజింగ్ విజన్-204’ నాటికి రాష్ట్రాన్ని బలమైన ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా సాగుతున్నది.

నూతన అధ్యాయం దిశగా..

ఆర్డీవో, మున్సిపల్ కేంద్రాల్లో, క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలు పరిష్కారం కోసం ప్రజాపాలనలో భాగంగా ప్రతి సోమవారం సాగే వినతుల స్వీకరణ పెద్ద వెసు లుబాటు అని చెప్పొచ్చు. పెన్షన్లు, సొంత గృహాలు, రేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పుల కోసం వేలాది మంది దరఖాస్తు చేసుకున్న వైనం తెలిసిందే. కొత్త పంచాయతీల్లో వెలుగులు నింపే ప్రక్రియ మొదలైంది. గ్రామాల్లో ఉన్న మౌలిక సదుపాయాలు గుంతలు తేలిన రోడ్లకు ఇప్పటికే మరమ్మతు లు కొలిక్కి వస్తున్నాయి.

గాంధీజీ కలలుకన్న గ్రామా స్వరాజ్యం సాధించేందుకు రేవంత్ ప్రభుత్వం నూతన అధ్యాయం దిశగా అడుగులు వేస్తున్నది. రాష్ర్టంలో పోలీస్ వ్యవస్థ మహిళలకు రక్షణ కవచంలా ఉంటూనే బెట్టింగ్, సైబర్ నేరగాళ్లకు కళ్లెం వేస్తున్నది. జిల్లాలో అత్యున్నత పోలీస్ శిక్షణా కేంద్రాలు సహా పేకాట దగ్గర నుంచి పబ్‌ల వరకు కట్టడితో పాటు శాంతి, భద్రతకే అధిక ప్రాధా న్యమిస్తుంది. ఇలా ఒక్కొక్కటి ఒక్కో ఆశ.

రాబోయే 365 రోజులు వచ్చిపడే ఉపద్రవా ల నుంచి ప్రజలను రక్షించడం, ఒత్తిడి తగ్గించడం, ఆర్థికంగా వెసులుబాటు కల్పించడం, రాజకీయాల్లో సమున్నతంగా వ్యవహరించేలా నేతలకు దిశ, దశ నిర్దేశించడం ఈ ఏడాది అన్ని పార్టీల ముందున్న లక్ష్యాలు అని చెప్పొచ్చు. ఎలా ఉన్నా మిగతా రాష్ట్రాలకు ధీటుగా రెండు లక్షల రైతు రుణమాఫీ ఒక ఎత్తయితే.. దానిని ఠంచన్‌గా అందించడం మరో ఎత్తు.

ఏ ప్రభుత్వం అయినా అనుకున్నది అనుకున్నట్టుగా ఒక్కో పథకా న్ని లైన్‌లో పెట్టి ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా అడుగులు వేయడం మరొక ఎత్తు. ప్రభుత్వం కోటి మంది మహిళలను కోటీశ్వర్లుగా తీర్చిదిద్దేందుకు ఆర్థిక పరిపుష్టికోసం వడ్డీలేని రుణాలు, మహిళలకు ఉచిత ఆర్టీసి ప్రయాణం,ఐదు వందలకే గ్యాస్, పేదలకు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ బిల్లు లాంటి అంశాలు కోట్లమంది మహిళల ముఖాల్లో వెలుగులు నింపింది.

పక్కా ప్రణాళికలు..

తెలంగాణ ప్రభుత్వ పునర్నిర్మాణంలో వేస్తున్న అడుగులను ఇప్పటికే స్వాగతిస్తూ జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌కు పట్టం కట్టారు. పథకాల అమలులో వేచి చూసే ధోరణిలోనే ఓర్పు, విద్యా సంస్కరణల్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌కు శ్రీకారం చుట్టి కాంగ్రె స్ ఇప్పటికే తొలి అడుగు వేసింది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మధ్యాహ్న భోజ నం క్రమం తప్పకుండా పాటిస్తుంది. దీనికి తోడు పాత విధానాలను మార్చి చదువుల్లో నిలదొక్కుకునేలా అటు ఉపాధ్యాయ వర్గాని కి, ఇటు విద్యార్థి లోకానికి సరికొత్త బాటలేస్తోంది.

ఈ విద్యా సంవత్సరం విశ్వవిద్యాల యాల్లో అధ్యాపకుల భర్తీని చేసి రేవంత్ సర్కార్ తన మార్క్ చూపెట్టేందుకు తహతహలాడుతోంది. దేశానికే ఆదర్శంగా సంస్క రణల ప్రభావం ఉండేలా జాగ్రత్తపడుతూనే పక్కాగా ప్రణాళికను రూపొందించింది. వీటి లో సవాళ్లు ఎదురైనా అధిగమించేందుకు సర్కార్ సిద్ధమైంది. మరోవైపు ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలను సంతృప్తిపరిచేలా గత ప్రభుత్వ లోపాలను ఒక్కొక్కటిగా సవరించేందుకు ప్రయత్నం చేస్తుంది.

అన్నింటికీ మించి గత ప్రభుత్వం చేసిన లక్షల కోట్ల అప్పులు ఈ ప్రభుత్వానికి సంకటంగా మారింది. ఆర్థిక వెసులుబాటు లేకపోయినా వీటిని దారిలో పెట్టే ప్రయత్నం ప్రభుత్వానికి పెను సవాల్‌గా మారింది. గత ప్రభుత్వంలో పీఎఫ్ నుంచి డీఏ వరకు లక్షల్లో పేరుకుపోయిన బకాయిల కోసం వేతన జీవులంతా ఎదురు చూస్తున్నారు. పాలన గాడిన పెట్టేందుకు ఇప్పటికే బదిలీల పేరిట పాత వాసన లను దూరంగా ఉంచారు. 

కొన్నింటిలో మాత్రం ఆ వాసన ఇంకా పోలేదు. రాజకీ య జోక్యం, పక్షపాతం కొందరిలో సమసిపోలేదు. అందరికీ సమన్యాయం చేయాల నేదే ఉద్యోగ ధర్మంగా ఉన్నప్పటికీ దీనికి విరుద్దంగా వ్యవహరించే వారికి ఝలక్ ఇవ్వాల్సిన అవసరముంది. ఈ ఏడాది యం త్రాంగంలో పెను మార్పులకు ఇదే అతిపెద్ద సంకేతం అయ్యేటట్టు చూడాలన్న ప్రభుత్వం వైఖరి ఎలా ఉంటుందో వేచిచూద్దాం.  

బీసీలకు న్యాయం జరిగేనా?

నాడు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమ లు చేయడం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ ఏడాది సరికొత్త సవాల్. పంచాయతీ ఎన్నికల్లో 60 శాతం సర్పంచ్‌లు స్వాధీనం చేసు కున్నా ముఖ్యంగా జనం ఏ వైపు మొగ్గు చూపుతున్నారో ఆ దిశగానే అడుగులు కదపాల్సిన అవసరం ఉంది. ఎన్నికల సమ యంలో కామారెడ్డి డిక్లరేషన్ అమలులో 60శాతానికి పైగా ఉన్న బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఒక కొలిక్కి తెచ్చినా కార్యరూపం దాల్చలేదు.

అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి రిజర్వేషన్ వ్యతిరేకులను ఎండగట్టే ప్రయత్నం చేయలేదనే భావం బీసీ సమాజంలో ఉంది. రేవంత్ ప్రభుత్వం ఈ ఏడాదైనా రిజర్వేషన్ల అమలులో అండగా నిలుస్తుందేమోననే బీసీలు ఆశతో ఎదురుచూస్తున్నారు. కాంగ్రె స్ 2023కు పోల్చితే జరిగిన ఉప ఎన్నికల్లో, పంచాయతీ ఎన్నికల్లో బలపడింది.

అదే సమయంలో ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పది మంది ఎమ్మెల్యేల ఫిరాయింపులు, పలువురి రాజీనామాలతో ఆ పార్టీ క్షేత్రస్థాయిలో దెబ్బతిని దిగాలు పడింది. దీని నుంచి బయటపడేందుకు ఆ పార్టీ అస్త్రశస్త్రాలకు ఈ ఏడాది పదును పెట్టాలని తెగ ఆరాటపడుతుంది. అంతో ఇంతో పాత వాసనలతో మనువాద, హిందుత్వ ఎజెండాగా నెట్టుకొస్తున్న బీజేపీ, వామపక్షాలు కూడా ఈ ఏడాదైనా తమకు కలిసొస్తుందేమోనన్న ఆశలు పెంచుకుంటున్నాయి. 

ప్రపంచదేశాలు పాల్గొన్న గ్లోబల్ సమ్మిట్ విజయవంతంతో వెల్లువలా వచ్చి న 5.7 లక్షల కోట్ల పెట్టుబడులతో  తెలంగాణ రైజింగ్ దూసుకుపోవాలని, కృష్ణా జలా ల లొల్లి కొలిక్కిరావాలని, ఇంటిగ్రేటెడ్ స్కూ ల్స్ సార్థకం చేసుకొని చదువులో రాణించాలని విద్యార్థులు సహా అన్ని రంగాలు భావి స్తున్నాయి. విద్య, వైద్య ప్రాధాన్యంగా కొత్తకొత్త ప్రయోగాలతో రేవంత్ ప్రభుత్వం ముందుకు సాగడం ముదావహం. 

 వ్యాసకర్త సెల్:9866255355