calender_icon.png 1 May, 2025 | 5:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముగ్గురు మంత్రులున్నా అభివృద్ధేది?

01-05-2025 01:18:37 AM

మీడియా సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కొల్లు మాధవి, జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు 

ఖమ్మం, ఏప్రిల్ 30 ( విజయక్రాంతి ):-మాయమాటలు చెప్పి జనాలను మభ్యపెట్టడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ ను మించిపోయారని భారతీయ జనతా పార్టీ తెలంగాణా రాష్ట్ర కార్యదర్శి కొల్లు మాధవి ధ్వజమెత్తారు. ఖమ్మం నగరంలోని హోటల్ మినార్ గ్రాండ్ లో ఆపార్టీ జిల్లా అధ్యక్షులు నెల్లూరి కొటేశ్వర రావుతో కలిసి బుధవారం ఆమె మీడీయా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా రాష్ట్రం లో కాంగ్రెస్ ప్రభుత్వం అవలంభిస్తున్న తీరును ఎండగట్టారు. రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంటలను కొనుగొలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమ ర్శించారు. పంటలను మద్దతు ధరకె కొనుగోలు చేసెందుకు కేంద్రం సిద్దంగా ఉన్నప్పటికి మిల్లర్లతో కుమ్మక్కై ధాన్యం కొనుగొలులో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

జిల్లాలో ఉప ముఖ్యమంత్రితో పాటు ఇద్దరు మొత్తం ముగ్గురు మంత్రులు ఉన్నప్పటికీ అభివృద్ది మాత్రం కనుచూపు మేర కనిపించడంలేదని ఎద్దేవా చేశారు. ఇక ఇందిరమ్మ ఇల్లు అంటూ ప్రగల్బాలు పలుకుతున్న కాంగ్రె స్ నేతలే తమకు రాలేదంటూ ఆత్మహత్యా యత్నాలకు పాల్పడుతున్న సంఘటనలు సిగ్గుచేటుగా కనిపిస్తుందని, గత కొద్ది రొజుల క్రితం మాజీ ఎంపీపీ ఆత్మహత్యా యత్నానికి పాల్పడటమే అందుకు నిదర్శనమన్నారు. 

 విచ్చలవిడిగా మాదక ద్రవ్యాల  విక్రయాలు 

 జిల్లా అధక్షులు నెల్లూరి కోటేశ్వర రావు మాట్లాదుతూ జిల్లాలో విచ్చలవిడిగా మాధకద్రవ్యాల వినియోగం కొనసాగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఉప ముఖ్య మంత్రి నియొజకవర్గంలోని బోనకల్ మండలంలో గంజాయి వ్యాపారం మూడు పూలు ఆరు కాయలుగా కొనసాగుతోందని, రాజకీయాలకు తలొగ్గి అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నరని ఆరోపించారు. అడప దడపా కిలో, రెండు కిలోల గంజాయిని పట్టుకుంటూ ఎక్సైజ్ శాఖ అధికారులు కాంగ్రెస్ పాలకుల అడుగులకు మడుగులు తొక్కుతున్నారని విమర్శించారు.

జిల్లాలో రొజు రొజూకీ అరాచకాలు పెరిగిపొతున్నయని మంత్రుల అండతొనే ఈ కార్యకలాపలు జరుగు తున్నాయని ఆరోపించారు. 15 రోజుల క్రితం కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో వరి కల్లాలను సందర్శిస్తే రైతుల వేధన విస్తుపొయేదిగా ఉందని, ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లిన కనీస స్పందన లేకుండా పొయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులను ఏడ్పిస్తే ఆ ఉసురు రాష్ట్రానికి తగులుతుందని, ఇకనైనా ఇచ్చిన హామీలపై దృష్టిపెట్టి ప్రజా సంక్షేమానికి పాటుపడాలని సూచించారు.ఈ సందర్బంగా పెహ్లగామ్ ఘటనకు నిరసనగా పాకిస్తాన్ జెండాను కాళ్ళ కింద వేసి తొక్కి, నిరసన తెలిపారు.