ఉగ్రవాదానికి మద్దతిస్తే ఉక్కు పాదం
- ‘ఆపరేషన్ సిందూర్’తో అది నిరూపించాం
- భారత్ భాగస్వామ్యాన్ని విస్తరిస్తాం
- ఎస్‌సీవో సమావేశంలో కేంద్ర రక్షణశాఖ
- మంత్రి రాజ్‌నాథ్ సింగ్
బిష్కెక్, ఏప్రిల్ 28: ఉగ్రవాదంపై ఎలాం టి ద్వంద్వ ప్రమాణాలకు తావు ఉండకూడదని, ఉగ్రవాదులకు మద్దతిచ్చే, ఆశ్రయం కల్పించే దేశాలపై ఎస్‌సీవో (షాంఘై సహకార సంస్థ) కఠిన చర్యలు తీసుకోవాల్సిం దేనని భారత రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పష్టం చేశారు. మంగళవారం కిర్గిస్థాన్‌లో జరిగిన ఎస్‌సీవో రక్షణ మంత్రుల సమావేశంలో కేంద్రమంత్రి పాల్గొన్నారు. గతేడాది పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి గురించి ప్రస్తావిస్తూ ఈ ఘటన యావత్ మానవాళిని కుదిపేసిందన్నారు. దీని అనంతరం ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టి ఉగ్రవా దులు ఎక్కడ ఉన్నా తప్పించుకోలేరని భార త్ నిరూపించిందన్నారు. ఉగ్రవాదమే ప్రపంచానికి ప్రధాన ముప్పుగా మారిందని వ్యా ఖ్యానించారు.
తీవ్రవాదం, ఉగ్రవాదంతో పలు సమస్యలు ఎదుర్కొంటున్నామన్నారు. పాకిస్థాన్ పేరు ప్రస్తావించకుండానే ప్రభుత్వ మద్దతుతో జరిగే సీమాంతర ఉగ్ర దాడులను అస్సలు విస్మరించకూడదని హెచ్చరిం చారు. ప్రస్తుతం కొనసాగుతున్న సంక్షోభం, వరుస ఘర్షణల్లో అనేకమంది ప్రజలు ప్రా ణాలు కోల్పోయారని, భారీ ఆస్తి నష్టం కూ డా వాటిల్లిందన్నారు. ఉగ్రవాద బెదిరింపులకు వ్యతిరేకంగా చర్యలు తీసుకునేందుకు భారత్ సిద్ధంగా ఉందని రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు.
ఉద్రిక్తతల పరిష్కారానికి దౌ త్య మార్గాలను అనుసరించాలన్నారు. ఈ సందర్భంగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కజకిస్తాన్, కిర్గిస్తాన్ రక్షణ మంత్రులతో ముఖ్యమైన ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. ఆయన కజకిస్తాన్ రక్షణ మంత్రి, లెఫ్టినెంట్ జనరల్ డారెన్ కోసనోవ్తో సమావేశమయ్యారు. పరస్పర గౌరవానికి చిహ్నంగా ఇద్దరు నాయకులు బహుమతులు ఇచ్చిపుచ్చుకున్నారు. భారత్ స్తాన్‌ల మధ్య పరస్పర సహకారం ఇకపై ఒక ప్రాంతానికే పరిమితం కాకుండా విభిన్న రంగాలకు విస్తరిస్తామని ఇరుదేశాలు ప్రకటించాయి.






