ఓడరేవులపై దిగ్బంధాన్ని ఎత్తేయండి
- హోర్ముజ్ జలసంధిని తెరుస్తాం
- అమెరికాకు ఇరాన్ నూతన ప్రతిపాదన
టెహ్రాన్, ఏప్రిల్ 28: తమదేశంలోని ఓడరేవులపై అమెరికా దిగ్బంధనాన్ని ఎత్తివేస్తే, యుద్ధానికి ముగింపు పలికితే హోర్ముజ్ జలసంధిని తెరిచేందుకు తాము సిద్ధమని ఇరా న్ మధ్యవర్తిత్వం ద్వారా అమెరికాకు నూతన ప్రతిపాదన చేసినట్లు అంతర్జాతీయ వార్తా సంస్థ తన కథనంలో పేర్కొంది. అణు కార్యక్రమంపై మాత్రం తరువాత చర్చిద్దామని ప్రతిపాదించారు. అబ్బాస్ అరాగ్చీ పాకిస్థాన్ పర్యటన తరువాత ఈ పరిణామం చోటు చే సుకుంది. ప్రతిపాదన అందుకున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జాతీయ భద్రత, విదేశాం గ విధాన బృందంతో సిచ్యుయేషన్ రూమ్ సమావేశం నిర్వహించనున్నారని, అయితే ఇరాన్ ప్రతిపాదనకు అంగీకరించే అవకాశం లేదని తెలుస్తుంది.
యురేనియం శుద్ధి ప్రక్రియను నిలిపివేయడానికి ఇరాన్‌ను ఒప్పించ డం, శుద్ధి చేసిన యురేనియం నిల్వలను తొ లగించడం ఇప్పుడు ట్రంప్ యుద్ధ లక్ష్యాలని పేర్కొంది. కీలకమైన హొర్ముజ్ జలసంధిని అటు అమెరికా, ఇటు ఇరాన్ దిగ్బంధించడంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభ పరిస్థితులు తలెత్తాయి. ఇరాన్‌ను ఆర్థికంగా దెబ్బతీసేందుకు, ఆ దేశ ఆయిల్ ఎగుమతులను అడ్డుకునేందుకు హొర్ముజ్‌ను అమెరి కా దిగ్బంధించింది. ఎగుమతులు నిలిచిపోవడంతో అయిల్‌ను నిల్వ చేసేందుకు చోటు లేక ఇరాన్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నది. హొ ర్ముజ్ దిగ్బంధంతో అమెరికాపైనా ఒత్తిడి పెరుగుతున్నది. చమురు ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ప్రపంచదేశాలు తీవ్ర సంక్షో భంలో చిక్కుకున్నాయి.
ఇంధనం, ఎరువులు, ఆహార ధరలు భారీగా పెరిగాయి. అ మెరికాతో ఒప్పందం కుదుర్చుకోకపోతే ఇరాన్ చమురు పైప్‌లైన్లు పేల్చేస్తామని అ ధ్యక్షుడు ట్రంప్ చేసిన హెచ్చరికలపై ఇరాన్ ధీటుగా స్పందించింది. ఇరాన్ చమురు కేం ద్రాలు, మౌలిక వసతులపై అమెరికా దాడులకు మద్దతు పలికితే గల్ఫ్ దేశాలపై భీకర దాడులకు దిగుతామని ఇరాన్ హెచ్చరించింది. తమపై దాడికి ప్రతీకారంగా నాలుగు రెట్లు గల్ఫ్ దేశాల్లో విధ్వంసం సృష్టిస్తామని, మా లెక్కలు మాకున్నాయని ఇరాన్ ఉపాధ్యక్షుడు ఇస్మాయిలీ ఇస్ఫహాన్ హెచ్చరించారు.






