calender_icon.png 15 September, 2025 | 8:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజావాణిలో పురుగుల మందు తాగిన వృద్ధుడు

15-09-2025 07:07:38 PM

రాజన్న సిరిసిల్ల,(విజయక్రాంతి): ప్రజావాణిలో వృద్ధుడు. పురుగుల మందు తాగిన ఘటన, రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ జరిగింది. వివరాల్లోకి వెళ్తే రుద్రంగి మండలానికి చెందిన అజ్మీరా విఠల్ అనే వృద్ధుడు కొడుకు, కోడలు పోషించడం లేదని, ఉన్న భూమిని కూడా వారే సాగు చేస్తూ నాకు నా భార్యకు బుక్కెడు బువ్వ పెట్టడం లేదంటూ సోమవారం జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. రుద్రంగి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన ఎటువంటి ప్రయోజనం లేదని, అప్పటికే తన వెంట వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగాడు. ఇది గమనించిన అధికారులు వెంటనే అప్రమత్తమై చికిత్స నిమిత్తం సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఏది ఏమైనా తనను పోషించడం లేదని వృద్ధుడు. పురుగుల మందు తాగడం. జిల్లాలో కలకలం లేపింది.