08-09-2025 02:10:52 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) కురవి మండలంలోని తిరుమలాపురం నల్లెల్ల శివారులోని గణేష్ కుంటలో తాబేళ్ల వేటకు వెళ్లిన ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. బాజా వెంకన్న, భూతం వెంకన్న కలిసి తాబేళ్ల వేటకు వెళ్లగా ప్రమాదవశాత్తు భూతం వెంకన్న కుంటలో మునిగిపోయాడు. ఈ విషయాన్ని అతడి వెంట వెళ్లిన భాజా వెంకన్న సమాచారం ఇవ్వడంతో అగ్నిమాపక సిబ్బంది కుంటలో దిగి భూతం వెంకన్న ఆచూకీ కోసం గాలిస్తున్నారు.