calender_icon.png 8 September, 2025 | 4:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సాధారణ ప్రజలపై పన్ను భారాన్ని తగ్గించిన ప్రధాని మోదీ

08-09-2025 01:25:58 PM

పటాన్చెరు (విజయక్రాంతి): పటాన్‌చెరు నాయకుడు బైండ్ల కుమార్ మాట్లాడుతూ, “ప్రపంచ దేశాలు ఆంక్షలకు, అధిక పన్నులకు భయపడుతుంటే, వాటన్నిటినీ బేఖాతరు చేస్తూ దేశ ప్రజలపై పన్ను భారం తగ్గించిన ధైర్యం ఉన్న నాయకుడు ప్రధాని నరేంద్ర మోదీ” అన్నారు. నిత్యావసర సరుకులు, ఆహార పదార్థాలపై పన్ను రేట్లు 18%, 12% నుంచి 5%, 0% వరకు తగ్గించడం ద్వారా సాధారణ ప్రజలపై భారం తగ్గిందని ఆయన అభిప్రాయపడ్డారు. అంత్యోదయ యోజన సిద్ధాంతానికి అనుగుణంగా పనిచేస్తున్న మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. “దేశ ప్రజల కోసం పన్నులు తగ్గించి పండుగ కానుక ఇచ్చిన ప్రధాని మోదీని విమర్శించడం, దీనివల్ల దేశం నష్టపోతుందని కాంగ్రెస్ నాయకులు మాట్లాడడం సిగ్గుమాలిన వాదన” అని బైండ్ల కుమార్ పేర్కొన్నారు.