calender_icon.png 8 September, 2025 | 5:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆదాయంలో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్

08-09-2025 01:41:04 PM

హైదరాబాద్: తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్ అని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) అన్నారు. ప్రజాభవన్‌ లో రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో భట్టి విక్రమార్క పాల్గొని మాట్లాడారు. వ్యవసాయం పారిశ్రామిక సేవా రంగాల్లో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్ అని పేర్కొన్నారు. కర్ణాటక హర్యానాను అధిగమించి తెలంగాణ రికార్డులు సాధించిందని.. వార్షిక రుణ ప్రణాళికలలో మొదటి క్వార్టర్ లోనే 33.64 శాతం సాధించిందని తెలిపారు. 

33.64 శాతం సాధించడం అభినందనీయమని.. ఇందిరమ్మ ఇళ్లకు, స్వయం ఉపాధి పథకాలకు రుణాలు ఇవ్వాలని పేర్కొన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు విరివిగా రుణాలు ఇవ్వండని.. ఆస్తుల తాకట్టు ఫిక్స్డ్ డిపాజిట్లు చేయండని రైతులని ఒత్తిడి చేయవద్దని తెలిపారు. వ్యవసాయ రంగాన్ని ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా భావిస్తుందని.. రైతుల పక్షాన రుణామాఫీ రైతు భరోసా పేరిట బ్యాంకులకు రుణాలు జమ చేశామని అన్నారు. రూ.30  కోట్లు రైతుల పక్షాన బ్యాంకులకు రాష్ట్ర ప్రభుత్వం జమ చేసిందని.. బ్యాంకింగ్ రికవరీ చరిత్రలో ఇది ఒక రికార్డు అని వెల్లడించారు.