calender_icon.png 8 September, 2025 | 5:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టేకులపల్లిలో ఘనంగా ఎమ్మెల్యే కోరం కనకయ్య జన్మదిన వేడుకలు

08-09-2025 02:09:27 PM

టేకులపల్లి (విజయక్రాంతి): టేకులపల్లి మండల కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో సోమవారం ఇల్లందు నియోజకవర్గ ఎమ్మెల్యే కోరం కనకయ్య(MLA Koram Kanakaiah) జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే కోరం కనకయ్య హాజరై కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి సందడి వాతావరణంలో పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యేకి కేక్ తినిపిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరం సురేందర్, మండల అధ్యక్షులు దేవా నాయక్, నాయకులు ఈది గణేష్, పీఏసిఎస్  చైర్మన్ లక్కినేని సురేందర్ రావు, మోకాళ్ళ పోశాలు, ఇస్లావత్ రెడ్యానాయక్, మధురెడ్డి, భద్రు, బండ్ల రజినీ, మహాలక్ష్మి, సరిత, చంద్రకళ, కాలే ప్రసాద్, నర్సింగ్ లక్ష్మయ్య, ఊళ్ళోజి ఉదయ్, తిరుపతి, బొడ్డు అశోక్, భూక్యా సర్దార్, బానోత్ రవి, రాందాస్, ముచ్చా సుధాకర్, హనుమంతు, శ్యామ్, మూడ్ గణేష్, సుధీప్ తదితరులు పాల్గొన్నారు.