calender_icon.png 8 September, 2025 | 5:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన ప్రణయ్

08-09-2025 02:07:53 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఇటీవల తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన ఆల్ ఇండియా సివిల్ సర్వీస్(All India Civil Service) ఉద్యోగుల జిల్లా స్థాయి చదరంగం పోటీలో ఇనుగుర్తి మండల జిల్లా పరిషత్  పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ ప్రణయ్ విజేతగా నిలిచి రాష్ట్ర స్థాయిలో నిర్వహించే పోటీలకు ఎంపికైనట్లు జిల్లా యువజన క్రీడ శాఖ అధికారి జ్యోతి(District Youth Sports Department Officer Jyoti) తెలిపారు. ఈనెల 9, 10 తేదీల్లో హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రణయ్ పాల్గొంటారని ఆమె తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన ప్రణయ్ ని ఇనుగుర్తి పాఠశాల హెడ్మాస్టర్ రూప రాణి, సహచర ఉపాధ్యాయులు అభినందించారు.