calender_icon.png 2 August, 2025 | 10:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యాంకర్ స్వేచ్ఛ కేసు.. పూర్ణచంద్ర నాయక్‌కు బెయిల్

01-08-2025 01:32:59 AM

మంజూరు చేసిన నాంపల్లి కోర్టు

హైదరాబాద్, జూలై 31: ప్రముఖ యాం కర్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో నిందితుడిగా ఉన్న పూర్ణచంద్ర నాయక్‌కు నాం పల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇద్ద రు వ్యక్తులు, రూ. 10 వేల పూచీకత్తులు సమర్పించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే రిమాండులో ఉన్న పూర్ణచంద్ర నాయక్ ను తాజాగా స్వేచ్ఛ కుటుంబం ఫిర్యాదుతో  పోలీసులు పోక్సో కేసులో మరోసారి అ దుపులోకి తీసుకున్నారు.

నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేశారని పూర్ణచందర్ న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో నాం పల్లి కోర్టు పూర్ణచంద్రనాయక్‌కు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఇద్దరు వ్యక్తులు, రూ. 10 వేల పూచీకత్తులు సమర్పించాలని కోర్టు ఆదేశించింది.