calender_icon.png 2 August, 2025 | 5:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేదలకు మెరుగైన వైద్య అందిస్తాం

01-08-2025 01:31:11 AM

మలక్‌పేట్ ఎమ్మెల్యే అహ్మద్ బలాల

మలక్‌పేట్, జులై 31 (విజయ్‌క్రాంతి): పేదలకు మెరుగైన వైద్య సహాయం అందించేందుకు కృషి చేస్తున్నట్లు మలక్‌పేట్ ఎమ్మెల్యే అహ్మద్ బలాల అన్నారు. గురువారం పాత మలక్‌పేట్ డివిజన్లో నెల్లూరు మసీదు రోడ్‌లో ప్రభుత్వ మలక్‌పేట్ యూపీహెచ్‌సీ, యునాని, కంటి వైద్యశాల, హోమియోపతి తదితర ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా హెల్త్ క్యాంపును ఎమ్మెల్యే ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షా కాలంలో సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, దోమలు వ్యాప్తి చెందకుండా జీహెచ్‌ఎంసీ మలేరియా సిబ్బంది తగిన చర్యలు తీసుకోవాలన్నారు. హెల్త్ క్యాంప్‌లను నిర్వహిస్తూ ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలను ప్రజలకు చెరువలోకి తీసుకురావాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్‌ఎమ్ నాయకులు సైఫుద్దీన్ షఫీ, వాసు, తాహెర్ పాల్గొన్నారు.