01-08-2025 01:34:45 AM
మల్కాజిగిరి, జులై 31 : రాచకొండ కమిషనరేట్ లో విధులు నిర్వర్తించిన ఏడుగురు పోలీసు అధికారులు పదవీ విరమణ పొందిన సందర్భంగా, సీపీ సుధీర్ బాబు, ఐపీఎస్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం అందుకున్నారు. పదవి విరమణ పొందిన వారు అడిషనల్ డీసీపీ (ఎస్బి) టీవీ హనుమంతరావు, చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ ఎం. సుగుణ, సబ్ ఇన్స్పెక్టర్లు మహమ్మద్ షర్ఫుద్దీన్, డి. రామకృష్ణ, మహమ్మద్ ఫైజుద్దీన్, వి. సాగర్ రావు, ఏఆర్ ఏఎస్‌ఐ మహమ్మద్ షంషీర్ ఖాన్.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ పోలీస్ ఉద్యోగం సవాళ్లతో కూడుకున్నదని, వారు చేసిన సేవలు ప్రశంసనీయం అన్నారు. పదవీ విరమణ అనంతరం ప్రశాంత జీవితానికి సూచనలు ఇచ్చారు. పెన్షన్ డెస్క్ ద్వారా అవసరమైన సేవలు వేగంగా అందించాలంటూ అధికారులను ఆదేశించారు. డీసీపీ ఇందిరా, జి. నరసింహరెడ్డి, అదనపు డీసీపీ శివకుమార్, ఎసిపి రవీందర్ రెడ్డి, సిఏఓ పుష్పరాజ్, పోలీస్ సంఘాల నేతలు పాల్గొన్నారు.