మల్లికార్జున్ పల్లిలో పురాతన శిల్పం లభ్యం
04-04-2026 04:00 PM
మునిపల్లి,(విజయక్రాంతి): మండలంలోని మల్లికార్జునపల్లి గ్రామ శివారులో గల పాపమ్మ దేవాలయం నుంచి సింగూరు పానాది పనులు జేసీబీ సహాయంతో చేపడుతున్న క్రమంలో ఏదో పురాతనమైన రాయి బయట పడింది. దీంతో దానిని వెలికి తీయడంతో అది క్రీస్తు పూర్వం చెక్కిన నాగదేవుతల విగ్రహాలుగా గ్రామస్తులు గుర్తించి పాపమ్మ దేవాలయం వద్ద ఉంచారు. ఈ విగ్రహాన్ని దేవాదాయ శాఖ పురవాస్తు అధికారులు పరిశీలించి విగ్రహాన్ని స్థాపితం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.




