అట్టహాసంగా రన్ ఫర్ జీసస్ ర్యాలీ
04-04-2026 04:02 PM
బెల్లంపల్లి,(విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలో రన్ ఫర్ జీసస్ అట్టహాసంగా జరుపుకున్నారు. నియోజకవర్గంలో ఏడు మండలాలకు సంబంధించిన 50 చర్చిల పాస్టర్లు రన్ ఫర్ జీసస్ వేడుకను నిర్వహించారు. ఏసుక్రీస్తు గుడ్ ఫ్రైడే రోజున సిలువ వేయబడి మానవులకు పరలోక రాజ్యాన్ని అనుగ్రహించడానికి, మరణాన్ని జయించి, మృత్యుంజయుడై మన కొరకు తిరిగి లేస్తాడని తెలియపరచడం కోసo రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఏసుక్రీస్తు కోసం పరిగెత్తటం, ఏసుక్రీస్తు మరణాన్ని జయించి తిరిగి లేస్తాడని తెలియపరచడమే రన్ ఫర్ జీసస్ ముఖ్య ఉద్దేశం తెలిపారు. రన్ ఫర్ జీసస్ ర్యాలీ రోమన్ క్యాథలిక్ చర్చి నుంచి ప్రారంభమై కాల్ టెక్స్, అశోక్ నగర్, రాంనగర్, తిలక్ స్టేడియం, మీదుగా సి ఎస్ ఐ చర్చి ప్రాంగణం వరకు కొనసాగింది.




