calender_icon.png 10 November, 2025 | 8:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అందెశ్రీ మరణం తీరని లోటు

10-11-2025 06:43:04 PM

నకిరేకల్ (విజయక్రాంతి): కవి, రచయిత అందెశ్రీ మరణం తెలంగాణ సాహిత్యానికి తీరని లోటని కవి, రచయిత పలస వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులకు మట్టి బిడ్డల కళావేదిక తరుపున ప్రగాఢ సానుభూతిని ప్రకటిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా బహుజన మహాసభ నల్లగొండ జిల్లా కన్వీనర్ చెట్టుపల్లి కాశీరాం ఆధ్వర్యంలో కవి రచయిత అందెశ్రీ మృతికి సంతాపం తెలుపుతూ నకిరేకల్ మెయిన్ సెంటర్ లో ఆయన చిత్రపటం వద్ద నివాళులర్పించారు. కార్యక్రమంలో నాయకులు బోల్లి కొండ లింగయ్య, అంబటి చిరంజీవి, గజ్జి రవి, మామిడి ఎల్లయ్య పాల్గొన్నారు.