10-11-2025 06:40:41 PM
కోదాడ: హైదరాబాద్ అంబేద్కర్ స్ఫూర్తి భవనంలో జరిగిన రాష్ట్ర స్థాయి సమతా సైనికులు సమావేశంలో నేషనల్ ఉపాధ్యక్షులు దాసరి శ్యామ్ మనోహర్, రాష్ట్ర అధ్యక్షులు రవీందర్ బౌద్ధమాల చేతుల మీదుగా సూర్యాపేట జిల్లా ఉపాధ్యక్షుడిగా కూరపాటి క్రాంతి కుమార్ నియామక పత్రాలు సోమవారం అందజేశారు. తన నియామకం పట్ల క్రాంతి కుమార్ హర్షం వ్యక్తం చేశారు. తన నియామకానికి సహకరించిన నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.