10-11-2025 08:08:04 PM
సుల్తానాబాద్,(విజయక్రాంతి): సుల్తానాబాద్ రహదారిపై ట్రాఫిక్ అంతరాయం లేకుండా రోడ్డుకు ఇరువైపులా ఉన్న చిరు వ్యాపారులు సహకరించాలని సుల్తానాబాద్ మున్సిపల్ కమిషనర్ రమేష్, సుల్తానాబాద్ సిఐ సుబ్బారెడ్డి, పెద్దపల్లి ట్రాఫిక్ సిఐ అనిల్ కుమార్ ల తోపాటు రోడ్డు సేఫ్టీ అధికారులు వ్యాపారులకు సూచించారు. మండల కేంద్రంలో రోడ్డుపై ఉన్న రద్దీని గమనించి రోడ్డు కు ఇరువైపులా దుకాణదారులు తమ వ్యాపారాన్ని పూర్తిగా రోడ్లమీద తీసుకువచ్చారని త ద్వారా రాజీవ్ రహదారిపై అధివేగంగా ప్రయాణించే వాహనాలు ద్వారా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు.
రోడ్డుకు ఆనుకొని ఉన్న దుకాణాల ద్వారా ద్విచక్ర వాహనాలు ప్రజలు రోడ్డుపై సంచరిస్తున్నారని తద్వారా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని ప్రజలందరూ సహకరించి తమ వ్యాపారాన్ని దుకాణ సముదాయంలోనే నిర్వహించు కునేలా సహకరించాలని చిరు వ్యాపారులు రోడ్లకు అతి సమీపంగా వ్యాపారం నిర్వహించకుండా రోడ్డుకు దూరంగా వ్యాపారం చేపడితే ప్రమాదాలు నివారించవచ్చునని సూచించారు. ముఖ్యంగా శాస్త్రి నగర్ నుండి మొదలుకొని చెరువు సమీపము వరకు వ్యాపారులందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బీఈఈ, ఏఈ గుణశేఖర్, హెచ్కేఆర్ ప్రాజెక్టు మేనేజర్ తో పాటు పలువురు పాల్గొన్నారు.