10-11-2025 06:44:47 PM
నిర్మల్ (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో సోమవారం పోలీసుల ప్రజావాణి కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ జానకి షర్మిల నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల వద్ద నుంచి అర్జీలను స్వీకరించి వాటి పరిష్కారానికి పోలీస్ శాఖ చర్యలు తీసుకుంటుందన్నారు. కుటుంబ సమస్యలతో పాటు ఆర్థికపరమైన సమస్యలు ఉన్నప్పటికీ పోలీస్ శాఖలు సంప్రదించాలని భరోసా కల్పించారు, ఈ కార్యక్రమంలో ఏఎస్పీ ఉపేందర్ రెడ్డి పోలీసులు పాల్గొన్నారు.