calender_icon.png 10 November, 2025 | 9:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆచార్యుల పదోన్నతుల ప్రక్రియ షురూ..!

10-11-2025 07:57:59 PM

కాకతీయ యూనివర్సిటీ (విజయక్రాంతి): గోల్డెన్ జూబ్లీకి సిద్ధం అయిన కాకతీయ విశ్వవిద్యాలయం అధ్యాపకుల ప్రమోషన్స్ కోసం ఏర్పాటు చేసిన క్యారియర్ అడ్వాన్స్ మెంట్ స్కీమ్ (క్యాస్) ఎట్టకేలకు ఉపకులపతి ఆచార్య కె. ప్రతాప్ రెడ్డి, రిజిస్ట్రార్ ఆచార్య వి. రాంచంద్రం చొరవతో 10 నుండి 14 వరకు అర్హులైన 47 మందికి ఈరోజు ఇంటర్వ్యూలు మొదలైనాయి. 2010లో ఆచార్య లింగమూర్తి ఉపకులపతిగా నియమించిన అధ్యాపకులు ప్రమోషన్ నోచుకోక 'క్యాస్' పదోన్నతికి ఎదిరిచూస్తున్న తరుణంలో మొదటిరోజు హాజరైన పలువురు అధ్యాపకుల ముఖాల్లో ఆనందం కన్పించింది.

ఇన్నాళ్లు న్యాయపరమైన చిక్కులు, గత ప్రభుత్వం ఉదాసీన వైఖరితో నష్టపోయిన అధ్యాపకులు ఇటీవల 23మంది అకడమిక్ గ్రేడ్ పే పొందినవారితో సహా,సహా అచార్యులు సీనియర్ ఆచార్యులుగా అర్హత సాధించారు.సంబంధిత విభాగాల డీన్ పర్యవేక్షణలో ఎలాంటి ఉల్లంఘనలు లేకుండా  చర్యలు తీసుకున్నారు. ఇటీవల ఉస్మానియా యూనివర్సిటీ క్యాస్ ఇంటర్వ్యూలలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి 47మంది అధ్యాపకులు అన్యాయం చేసిందని ఆందోళన బాట్టడం గమనార్హం.