01-05-2025 06:10:39 PM
గూడూరు (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం (లక్ష్మితండ) దామెరవంచ శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి దేవాలయంలో అంజన్న మాలాదారులు పూజలు నిర్వహించారు. వాంకుడోతూ నంద (కన్నె స్వామి), వాంకుడోతూ వెంకన్న (కన్నె స్వామి) ఆధ్వర్యంలో గూడూరు మండలానికి ఆంజనేయస్వామి మాలాధారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. శ్రీ వీరభద్ర స్వామి భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం అంజన్న మాలదారులకు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.