01-05-2025 06:13:04 PM
ఉట్నూర్ (విజయక్రాంతి): ఉట్నూర్ మండలంలోని బిర్సాయి పెట్ గ్రామానికి చెందిన ముడుగు లక్ష్మీ గత కొంత కాలంగా క్యాన్సర్ బారిన పడి బాధపడుతున్నారు. విషయం తెలుసుకున్న ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్(MLA Vedma Bojju Patel) ఆమెను గురువారం పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ పథకంలో మొదటి విడతలో ఇండ్లు ఇస్తామని అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తనవంతుగా బాధితురాలికి ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.